Pakistan: పాక్ చరిత్రలో తొలిసారిగా రూ.300 మార్కు దాటిన ఇంధన ధరలు

  • అధిక విద్యుత్ చార్జీలతో అల్లాడుతున్న పాక్ ప్రజలపై ఇంధన ధరల భారం
  • గురువారం ఇంధన చార్జీలు పెంచిన ఆపద్ధర్మ ప్రభుత్వం
  • పెట్రోల్ లీటరకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంపు
  • ఫలితంగా లీటర్ పెట్రోల్ రూ.305.36కు, డీజిల్ ధర రూ.311.84కు చేరిన వైనం
Pakistans petrol diesel prices cross Rs 300 mark for the first time in history

విద్యుత్ చార్జీల భారంతో ఇప్పటికే అల్లాడుతున్న పాక్ ప్రజలను ఇంధన ధరలు కూడా పట్టి పీడిస్తున్నాయి. పాక్ చరిత్రలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ.300 మార్కును దాటాయి. ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నేతృత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం పెట్రోల్ ధర లీటరుకు రూ.14.91, డీజిల్ ధర రూ.18.44 మేర పెంచింది. దీంతో, లీటరు పెట్రోల్ ధర రూ.305.36కు చేరుకోగా, డీజిల్ ధర రూ.311.84ను తాకింది. 

ఇటీవల కాలంలో పాక్ ప్రజలు విద్యుత్ చార్జీలు భరించలేక నిరసనల బాట పట్టారు. పలు ప్రాంతాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, విద్యుత్ బిల్లుల దహనాలను చేపట్టారు. డిస్కమ్ సంస్థల అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. ఇక ప్రజలపై ధారాభారాన్ని తగ్గించేందుకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఊరట కల్పించట్లేదు.

More Telugu News