CM KCR: రాఖీ కట్టించుకుని తోబుట్టువుల కాళ్లు మొక్కిన సీఎం కేసీఆర్

- ప్రగతి భవన్ లో రక్షాబంధన్ వేడుకలు
- కేసీఆర్ కు రాఖీలు కట్టిన అక్కలు, చెల్లెలు
- తోబుట్టువుల ఆశీస్సులు అందుకున్న కేసీఆర్
హైదరాబాదులో సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో రాఖీ పౌర్ణమి సంబరాలు వెల్లివిరిశాయి. ఇవాళ ప్రగతి భవన్ కు సీఎం కేసీఆర్ తోబుట్టువులు విచ్చేశారు. సీఎం కేసీఆర్ కు ఆయన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన అక్కల కాళ్లు మొక్కి వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. తోబుట్టువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభమ్మ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.


