Sudheer Babu: నేను దర్శకుడిగా మారితే పవన్ కల్యాణ్ తో సినిమా తీస్తా: సుధీర్ బాబు

Sudheer Babu says if he turns director he will make a film with Pawan Kalyan
  • ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు
  • దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారంటూ ప్రశ్న
  • ఏమాత్రం తడుముకోకుండా జవాబిచ్చిన సుధీర్ బాబు
  • తన సినిమాలో పవన్ ను సీఎంను చేస్తానని వెల్లడి 
  • సంబరపడిపోతున్న పవర్ స్టార్ అభిమానులు 
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు బావ, నటుడు సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడిగా మారితే ఎవరితో సినిమా తీస్తారన్న ప్రశ్నకు "పవన్ కల్యాణ్ తో" అంటూ ఏమాత్రం ఆలోచించకుండా సమాధానం చెప్పారు. 

"నేను దర్శకుడిగా మారితే... నా తొలి చిత్రంలో హీరో పవన్ కల్యాణే. అది కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తోనే ఉంటుంది. నా సినిమాలో పవన్ ను ముఖ్యమంత్రిని చేస్తా" అంటూ పవన్ అభిమానులకు ఆనందం కలిగించే వ్యాఖ్యలు చేశారు. దీనిపై పవన్ అభిమానులు, జనసేన మద్దతుదారులు భారీగా స్పందిస్తున్నారు. వచ్చే ఏడాది నిజంగానే పవన్ సీఎం అవుతారని, అప్పుడు గనుక సినిమా తీస్తే బ్రహ్మాండంగా ఉంటుందని అభిమానులు పేర్కొంటున్నారు.
Sudheer Babu
Pawan Kalyan
Director
Actor
Mahesh Babu
Tollywood
Janasena

More Telugu News