Prabhas: రేపటి నుంచి రంగంలోకి దిగుతున్న ప్రభాస్!

  • సెప్టెంబర్ 28న రానున్న 'సలార్'
  • వచ్చే ఏడాది మే నెలలో 'కల్కి'
  • షూటింగు దశలో 'రాజా డీలక్స్'
  • ప్రభాస్ సరసన ముగ్గురు భామలు
Raja Deluxe movie shooting update

ప్రభాస్ హీరోగా ఒకదాని తరువాత ఒకటిగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమాలు ఆశించినస్థాయి విజయానికి దూరంగానే ఉండిపోతున్నాయి. దాంతో ఆయన అభిమానులంతా డీలాపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సలార్' రెడీ అవుతోంది.

ఇక ఆ తరువాత సినిమాగా ఆయన చేస్తున్న 'కల్కి'పై కూడా ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. అమితాబ్ - కమల్ వంటి సీనియర్ స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా మారుతి దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'రాజా  డీలక్స్' సినిమాపైనే దృష్టి పెట్టారు. రేపటి నుంచి ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరగనుందని సమాచారం. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ముగ్గురు ముద్దుగుమ్మలు మెరవనుండటం విశేషం. 

More Telugu News