Twitter: ట్విట్టర్ లో ఆడియో, వీడియో కాల్స్

  • కాలింగ్ ఫీచర్స్ తీసుకొస్తున్నట్టు తెలిపిన మస్క్
  • ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లో సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడి
  • ప్రపంచ అడ్రస్ బుక్ కు ఎక్స్ వేదిక అవుతుందని వ్యాఖ్య
Video and Audio calls in Twitter

ప్రముఖ సోషల్ మెసేజింగ్ సంస్థ ట్విట్టర్ (ఎక్స్) సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ఫోన్ నెంబర్ లేకుండానే వీడియో, ఆడియో కాల్ సదుపాయం తీసుకొస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఐఓఎస్, పీసీ, ఆండ్రాయిడ్ లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అత్యంత ప్రభావవంతమైన ప్రపంచ అడ్రస్ బుక్ కు ఎక్స్ వేదిక అవుతుందని అన్నారు. మరోవైపు ఈ కొత్త ఆప్షన్ల గురించి ఎక్స్ సీఈవో లిండా యాకరినో కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు. ఇన్స్టాలో ఉన్నట్టుగానే ఎగువన కుడివైపు ఉండే డీఎం మెనూలో కాలింగ్ ఆప్షన్ ఉంటుందని చెప్పారు.

More Telugu News