Pawan Kalyan: 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్తరువు... వీడియో ఇదిగో!

  • సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు
  • నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో కళాకృతి
  • మేకింగ్ వీడియో విడుదల చేసిన నాదెండ్ల మనోహర్ 
Pawan Kalyan artifact with 470 kilos of silver

జనసేనాని పవన్ కల్యాణ్ సెప్టెంబరు 2న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో, నెల్లూరు సిటీ జనసేన పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో 470 కేజీల వెండితో పవన్ కల్యాణ్ చిత్రరూపాన్ని రూపొదించారు. వెండి గొలుసులు ఉపయోగించి ఈ కళాకృతిని తీర్చిదిద్దారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News