రాఖీ పండుగ వేళ చెల్లికి క్షమాపణలు చెప్పిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా
- రక్షాబంధన్ సందర్భంగా తన సోదరి రాధికతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆనంద్
- బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఒకరు కలర్ గా మార్చారని వెల్లడి
- ఫొటో తీసుకునే సమయానికి ఇంకా పుట్టని చెల్లెలు అనూజకు సారీ చెప్పిన ఆనంద్
'కొన్ని సంవత్సరాల క్రితం కిందట నా సోదరి రాధిక, నేను కలిసి ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో షేర్ చేశాను. అయితే ఎవరో దీన్ని కలర్ ఫోటోగా మార్చారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే, నా చెల్లెలు అనూజకు మాత్రం క్షమాపణలు చెబుతున్నా. ఎందుకంటే ఈ ఫొటో తీసిన సమయానికి ఆమె ఇంకా పుట్టలేదు’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.