Uttar Pradesh: నమాజ్ కోసం బస్ ఆపినందుకు విధుల నుంచి తొలగింపు.. కండక్టర్ ఆత్మహత్య

  • యూపీలో తాజాగా షాకింగ్ ఘటన
  • ఇద్దరు ప్రయాణికులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా బస్ ఆపిన యూపీ ఆర్టీసీ కండక్టర్
  • విషయం వెలుగులోకి రావడంతో జూన్‌లో విధుల నుంచి తొలగింపు
  • ఫలితంగా మోహిత్ కుటుంబం ఆర్థికకష్టాల్లో కూరుకుపోయినట్టు ఆయన భార్య వెల్లడి
  • సోమవారం కండక్టర్ రైలు కిందపడి ఆత్మహత్య
UP Conductor Sacked After Stopping Bus For Namaz Dies By Suicide

యూపీలో తాజాగా సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్సును కాసేపు ఆపినందుకు ఉద్యోగం కోల్పోయిన ఓ కండక్టర్ తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మోహిత్ యాదవ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌‌‌పోర్టు కార్పొరేషన్‌లో కాంట్రాక్ట్ విధానంలో కండక్టర్‌గా పనిచేసేవాడు. జూన్‌లో ఓ రోజు ఆయన బరేలీ నుంచి డీల్లీ వెళుతున్న బస్సును ఇద్దరు ప్రయాణికులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా కాసేపు ఆపారు. అనంతరం.. ఈ విషయం వెలుగులోకి రావడంతో యూపీ ఆర్‌టీసీ అతడిని విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత మరో ఉపాధి కోసం అనేక విఫలయత్నాలు చేసి ఆర్థికకష్టాల్లో కూరుకుపోయిన మోహిత్ యాదవ్ సోమవారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

మానవత్వం ప్రదర్శించినందుకు తన భర్త భారీ మూల్యం చెల్లించుకున్నారని మోహిత్ యాదవ్ భార్య రింకీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎనిమిది మంది ఉన్న కుటుంబ బాధ్యత మొత్తం తన భర్తదేనని, ఆయనకొచ్చే 17 వేల జీతంపైనే యావత్ కుటుంబం ఆధారపడిందని ఆమె తెలిపింది.

More Telugu News