AAP: I.N.D.I.A. కూటమి భేటీకి ముందు ఆప్ నేత కీలక వ్యాఖ్యలు!

  • కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూడాలనుకుంటున్నట్లు తెలిపిన ఆప్ నాయకురాలు
  • ఢిల్లీలో అనేక పథకాలు అమలు చేసినా మిగులు బడ్జెట్ ఉందన్న ప్రియాంక కక్కర్
  • కేజ్రీవాల్ ప్రధాని అయితే భారత్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతుందని వ్యాఖ్య
AAP Pitches For Arvind Kejriwal As Prime Ministerial Candidate For INDIA Bloc

I.N.D.I.A. కూటమి మూడో సమావేశం ముంబైలో రేపు జరగనుంది. పాట్నా, బెంగళూరులలో మొదటి రెండు సమావేశాలు నిర్వహించిన ఈ కూటమి తదుపరి భేటీని రేపు దేశ ఆర్థిక రాజధానిలో నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూడాలని భావిస్తున్నట్లు తెలిపారు. 

'మీరు నన్ను అడిగితే కేజ్రీవాల్‌ను ప్రధానమంత్రి అభ్యర్థిగా కోరుకుంటాను. ద్రవ్యోల్బణం విషయానికి వచ్చినా దేశ రాజధాని ఢిల్లీలో ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. అలాగే ఉచిత నీరు, ఉచిత విద్య, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు ఉచిత తీర్థయాత్ర అందిస్తున్నాం. అయినప్పటికీ మేం మిగులు బడ్జెట్‌ను చూపిస్తున్నాం' అని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ ప్రజా సమస్యలను లేవనెత్తుతారని, వాటిని పరిష్కరించే దిశగా ఆలోచిస్తారన్నారు. కేజ్రీవాల్ ప్రధాని అయితే భారత్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతుందని, లైసెన్స్ రాజ్ ముగిసిపోతుందని, వ్యవసాయానికి ప్రాధాన్యత లభిస్తుందన్నారు.

More Telugu News