Rakshabandhan: కన్నీళ్ల మధ్య అన్న మృతదేహానికి రాఖీ కట్టిన సోదరి.. కంటతడి పెట్టిస్తున్న వీడియో!

  • పెద్దపల్లి జిల్లా ధూళికట్ట గ్రామంలో విషాదం
  • పండుగ పూట గుండె పోటుతో అన్న మృతి
  • రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరి కన్నీటిపర్యంతం
Sister Ties Rakhi on Dead Brothers Wrist

రాఖీ పండగ సందర్భంగా అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ సోదరికి కన్నీరే మిగిలింది. పండగ పూట ఆ ఇంట్లో విషాదం అలముకుంది. గుండెపోటుతో తోడబుట్టినవాడు కుప్పకూలడంతో కన్నీటిపర్యంతమైంది. ఏడుస్తూనే అన్న మృతదేహానికి రాఖీ కట్టడం చూసి గ్రామస్థులు కూడా కంటతడి పెట్టారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో బుధవారం ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసిన వాళ్లను కన్నీరు పెట్టిస్తోంది.

ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య బుధవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. రాఖీ పండగ సందర్భంగా కనకయ్య సోదరి గౌరమ్మ అన్న ఇంటికి వచ్చింది. సోదరుడికి రాఖీ కట్టి వెళదామని వచ్చిన గౌరమ్మ.. అన్న హఠాన్మరణంతో గుండెలవిసేలా రోదించింది. అప్పటిదాకా సంతోషంగా ఉన్న అన్న ఒక్కసారిగా విగతజీవిగా మారడం తట్టుకోలేకపోయింది. తీవ్ర దుఃఖంతోనే సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టింది.

More Telugu News