Kangana Ranaut: 'చంద్రముఖి 2' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్!

  • కంగనా ప్రధాన పాత్రగా 'చంద్రముఖి 2'
  • మరో ప్రధానమైన పాత్రలో లారెన్స్ 
  • ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి సంగీతం 
  • వినాయక చవితి సందర్భంగా ఐదు భాషల్లో విడుదల
Chandramukhi 2 lyrical song released

కంగనా రనౌత్ ప్రధాన పాత్రగా 'చంద్రముఖి 2' సినిమా రూపొందింది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా, గతంలో సంచలన విజయాన్ని సాధించిన 'చంద్రముఖి' సినిమాకి సీక్వెల్. రాజావారిగా లారెన్స్ నటించిన ఈ సినిమాకి పి. వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పట్ల అందరూ కూడా ఆసక్తితో ఉన్నారు. 

గతంలో వచ్చిన సినిమాకి విద్యాసాగర్ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమాను ఆయన మ్యూజికల్ హిట్ గా నిలబెట్టాడు. ఇప్పుడు ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా వేసిన సెట్లో కంగనా బృందం పై ఈ పాటను చిత్రీకరించారు.

 మదన్ కార్కే సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శ్రీనిధి తిరుమల ఆలపించారు. కళ నృత్య దర్శకత్వంలో ఈ పాటను ఆవిష్కరించారు. సినిమాలో ఈ పాట ప్రధానమైన ఆకర్షణగా నిలిచేలా ట్యూన్ చేసినట్టుగా అనిపిస్తోంది. తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను 'వినాయక చవితి' సందర్భంగా విడుదల చేయనున్నారు.

More Telugu News