Sunny Deol: నేను సినిమా తీస్తే దివాలాయే.. ఇక నిర్మాణం జోలికి పోను: సన్నీ డియోల్

  • ఇక మీదట సినిమాలను నిర్మించనన్న సన్నీ డియోల్
  • కార్పొరేట్ల ముందు వ్యక్తులు నిలబడడం కష్టమన్న అభిప్రాయం
  • వెనుకటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఏకరవు
Because I go bankrupt Sunny Deol on why he wonot produce films

బాలీవుడ్ నటుడు నిర్మాత, సన్నీ డియోల్ తాను నటించిన గదర్ 2 సినిమా సక్సెస్ సాధించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే రూ.56 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు సన్నీడియోల్ ప్రాపర్టీని వేలం వేస్తున్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవలే ప్రకటన జారీ చేయడం తెలిసిందే. కాకపోతే మరుసటి రోజే దాన్ని వెనక్కి తీసుకుంది. గదర్ సినిమా విజయం సాధిస్తే సన్నీ డియోల్ రుణ భారం నుంచి బయటపడే అవకాశం లభించినట్టు అవుతుంది. మరోవైపు తాను సినిమా నిర్మించిన ప్రతిసారీ దివాలా తీయడం సాధారణమేనంటూ సన్నీ డియోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీబీసీ ఏషియన్ నెట్ వర్క్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాతగా తన అనుభవాలను పంచుకున్నారు. 

చివరిగా సన్నీ డియోల్ తన కుమారుడు కరణ్ డియోల్ తో పల్ పల్ దిల్ కే పాస్ సినిమా నిర్మించారు. ఇక మీదట సినిమాలను నిర్మించకూడదనే నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఎందుకంటే నేను దివాలా తీస్తాననే. కొన్నేళ్ల క్రితం అయితే కొన్నింటిపై నాకు నియంత్రణ ఉండేది. ఎందుకంటే పంపిణీ సాధారణంగా ఉండేది. మేము ఒకరికొకరం మాట్లాడుకునే వాళ్లం. మా మధ్య అనుసంధానం ఉండేది. కానీ, కార్పొరేట్స్ వచ్చిన తర్వాత ఇంక ఏమీ మిగల్లేదు. వ్యక్తులుగా వారి ముందు నిలబడడం కష్టం. కావాల్సినన్ని థియేటర్లు ఇవ్వరు. వ్యక్తులు అక్కడ ఉండకూడదని వారు కోరుకుంటారు. గత దశాబ్దంలో నా సినిమాల విషయంలో కష్టాలు ఎదుర్కొన్నాను’’ అని సన్నీ డియోల్ సినీ కష్టాలను వివరించారు.

More Telugu News