మహారాష్ట్రలో పోటీ తర్వాత.. ముందు మీ రాష్ట్రాన్ని చక్కదిద్దుకోండి: కేసీఆర్పై ఉద్ధవ్ థాకరే ఫైర్
- దేశం బాగు కోరితే ఇండియా కూటమిలో చేరాలని కేసీఆర్కు ఉద్ధవ్ హితవు
- ఎన్డీయేను అమీబాతో పోల్చిన మహారాష్ట్ర మాజీ సీఎం
- ఎందులో చేరుతారో ఏదో ఒకటి బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్
- ఓట్లు మాత్రం చీల్చే ప్రయత్నం చేయొద్దని సూచన
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలనుకునే జాతీయవాద పార్టీల కూటమి ‘ఇండియా’ అని పేర్కొన్న ఆయన.. ఎన్డీయే అనేది నిర్దిష్ట రూపంలేని అమీబా లాంటిదని, కాబట్టి కేసీఆర్ ఇండియా వైపు ఉంటారో, లేదంటే ఎన్డీయే వైపు ఉంటారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశం వైపు ఉండాలనుకుంటే ‘ఇండియా’లో చేరాలని, బీజేపీతో ఉంటే ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించాలని కోరారు. అంతేకానీ, ఓట్లను మాత్రం చీల్చొద్దని హితవు పలికారు. మహారాష్ట్రలో పోటీ చేయడం సంగతి అటుంచి తొలుత తెలంగాణలో పరిస్థితులను చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు.