అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
- ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయుల మృతి
- జాక్సిన్‌విల్ ప్రాంతంలోని ఓ షాపు పార్కింగ్ స్థలంలో దుండగుడి కాల్పులు
- ఇది జాత్యాహంకార పూరిత దాడి అని పోలీసుల ప్రకటన
మధ్యాహ్నం దుండగుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్, హ్యాండ్ గన్‌తో వచ్చి పార్కింగ్ స్థలంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. జాత్యాహంకారంతోనే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడని జాక్సన్‌విల్ పోలీసులు తెలిపారు.