Tanikella Bharani: ‘తగ్గక్కర్లా’ అంటూ అల్లు అర్జున్‌ను కవితతో అభినందించిన తనికెళ్ల భరణి!

  • ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్
  • రెండు రోజులుగా ప్రశంసల వెల్లువ
  • అల్లూ విల్లుతో తెలుగు వాళ్ల బాకీ చెల్లు అంటూ తనికెళ్ల భరణి కవిత
tanikella bharani wishes allu arjun for national award

తెలుగు సినీ చరిత్రలో తొలిసారి ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు ఎంపికై అల్లు అర్జున్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో నటనకు గాను ఆయన ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఆయనకు సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. రెండు రోజులు గడిచినా ఇంకా అల్లు అర్జున్‌కు అభినందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి కూడా బన్నీకి కంగ్రాట్స్ చెప్పారు. వినూత్నంగా ఓ కవితతో అభినందనలు తెలిపారు. 

‘‘అర్జునుడై గురిపెట్టెను అల్లూ తన విల్లు.. శతాబ్దాల తెలుగు వాళ్ల బాకీ ఇక చెల్లు..” అని కవిత వినిపించారు. ఈ మేరకు వీడియోను ట్విట్టర్‌‌లో షేర్ చేశారు. ‘తగ్గేదే లే’ అంటూ పుష్పలో బన్నీ చెప్పే డైలాగ్‌ను గుర్తు చేస్తూ ‘తగక్కర్లా’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News