Nara Lokesh: అందుకే పోలవరం బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నారు: నారా లోకేశ్

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర
  • నూజివీడులో మామిడి రైతులతో ముఖాముఖి
  • కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టులు ఆలస్యం అయ్యాయన్న లోకేశ్
  • అందుకే పోలవరాన్ని రాష్ట్రం చేపట్టిందని వెల్లడి
  • జగన్ ది మురికి కాలువ రేంజ్ అంటూ విమర్శలు
Nara Lokesh talks about Polavaram

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతోంది. 194వ రోజు మీర్జాపురం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్రకు విశేష స్పందన లభించింది. 

కాగా, నూజివీడు శివార్లలో యువగళం పాదయాత్రపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. వారిని టీడీపీ కార్యకర్తలు తరిమికొట్టారు. ఈ సందర్భంగా కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం లోకేశ్ పాదయాత్ర షురూ చేశారు. 

మీర్జాపురం నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర గొల్లపల్లి, మోర్సపూడి, తుక్కులూరు, నూజివీడు మీదుగా పోతిరెడ్డి శివారు విడిది కేంద్రానికి చేరుకుంది. 

మామిడి రైతులతో లోకేశ్ ముఖాముఖి... హైలైట్స్ ఇవిగో...

పోలవరాన్ని నాశనం చేశారు

చంద్రబాబు గారికి పోలవరం రేంజ్... జగన్ ది మురికి కాలువ రేంజ్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏ జాతీయ ప్రాజెక్టు తొందరగా పూర్తి కాలేదు... అందుకే పోలవరం బాధ్యత చంద్రబాబు గారు తీసుకొని 72 శాతం పూర్తి చేశారు. కానీ, జగన్ వచ్చి పోలవరాన్ని నాశనం చేశాడు. 

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే ఒక మంత్రి బుల్లెట్ దిగిందా అంటాడు. ఇంకో మంత్రి అరగంట అంటాడు. పట్టిసీమను జగన్ దండగ అన్నాడు. ఇప్పుడు అదే జగన్ కి దిక్కైంది.

మోటార్లకు మీటర్లను ఒప్పుకోవద్దు

నూజివీడు మామిడి ప్రపంచం మొత్తం ఫేమస్. మామిడి గిట్టుబాటు కాక రైతులు అంతా పామ్ ఆయిల్ వైపు మళ్లారు. కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరం. రైతు భరోసా 12,500 ఇస్తానని కేవలం 7,500 ఇచ్చి మోసం చేశాడు. ఒక్కో రైతుకి జగన్ చేసిన మోసం రూ.25 వేలు. 

చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని జగన్ మోసం చేశాడు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు, పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల మోటార్లుకు మీటర్లు పెట్టాలని సైకో సీఎం ఆలోచిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అంగీకరించొద్దు.

చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తిచేస్తాం

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని మొదటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. జగన్ పాలనలో డ్రిప్ ఇరిగేషన్ ని నాశనం చేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రిప్ ఇరిగేషన్ అందిస్తాం. రైతు రథాలు, సూక్ష్మ పోషకాలు, ఇతర పనిముట్లు సబ్సిడీలో అందజేస్తాం. 

మామిడి పంటను ఉపాధి హామీ పథకంతో మొదటి మూడేళ్లు అనుసంధానం చేసే అవకాశం ఉంది. అది కచ్చితంగా చేస్తాం.

జగన్ ది హాలీడేల ప్రభుత్వం

జగన్ పాలనలో క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఆక్వా హాలిడే చూస్తున్నాం. జగన్ పాలనలో వ్యవసాయ శాఖ, ఆ శాఖకు మంత్రి ఉన్నారా? అనే అనుమానం వస్తుంది. 

రైతులు ఇబ్బందుల్లో ఉంటే జగన్ ప్యాలస్ లో పడుకున్నాడు. జగన్ బటన్ కి పవర్ పోయింది. అందుకే బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదు. మేం అధికారంలోకి వచ్చాక మామిడి ఉత్పత్తుల ఎక్స్ పోర్ట్ కోసం అవసరమైన డ్రైయర్లు సబ్సిడీలో అందిస్తాం.

నూజివీడు అన్నా క్యాంటీన్ వద్ద లోకేశ్ సెల్ఫీ చాలెంజ్

ఇది నూజివీడులోని అన్నా క్యాంటీన్. తాను పేదల పక్షమనే చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లను రద్దుచేసి వారి నోళ్లు కొట్టాడు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి లక్షలాది మంది పేదల ఆకలి తీర్చాం. 

అధికారంతో పాటు పదిమందికి సాయపడే గుణం కూడా ఉన్నవాడే నిజమైన పాలకుడవుతాడు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ద్వారా లక్షల కోట్లు పోగేసుకుంటున్న జగన్ కు ఆకలిగొన్న అభాగ్యులకు పట్టెడన్నం పెట్టడానికి మాత్రం మనసు రావడం లేదు. 

ధన దాహంతో ప్రజల రక్తం తాగుతున్న ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి జగనాసురుడికి అన్నార్తుల ఆకలి విలువ ఎలా తెలుస్తుంది?

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2595.8 కి.మీ.

*ఈరోజు నడిచిన దూరం 20 కి.మీ.*

*195వరోజు (26-8-2023) యువగళం వివరాలు*

*నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం (ఉమ్మడి కృష్ణాజిల్లా)*

ఉదయం

8.00 – పోతిరెడ్డిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.10 – పోతిరెడ్డిపల్లిలో స్థానికులతో సమావేశం.

9.25 – సింహాద్రిపురం – కొర్లగుంట వద్ద స్థానికులతో సమావేశం.

10.10 – పాదయాత్ర 2,600 కి.మీ.లకు చేరిక, యువనేత లోకేశ్ శిలాఫలకం.

10.40 – చెక్కపల్లి క్రాస్ వద్ద బీసీ సామాజికవర్గీయులతో సమావేశం.

11.40 – చిలుకానగర్ వద్ద స్థానికులతో సమావేశం.

11.55 – ముసునూరులో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.

12.25 – ముసునూరులో రచ్చబండ కార్యక్రమం.

1.40 – ముసునూరులో భోజన విరామం.

సాయంత్రం

4.00 – ముసునూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

రాత్రి 

9.00 – వలసపల్లి విడిది కేంద్రంలో బస.

******

More Telugu News