Task Games: టాస్క్ గేమ్స్ పేరిట రూ.9 కోట్లకు టోకరా... ఇద్దరిని అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు

  • సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట వేసిన విశాఖ పోలీసులు
  • మీడియాకు వివరాలు తెలిపిన సీపీ త్రివిక్రమ వర్మ
  • నిందితులకు మలేషియా నుంచి ఆదేశాలు అందుతున్నాయని వెల్లడి 
  • రివ్యూ రాస్తే రూ.150 ఇస్తామని వల విసురుతారని వివరణ
  • ఆ తర్వాత రూ.2 వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తారని స్పష్టీకరణ
Vizag police busted task games fraud

సైబర్ నేరగాళ్ల మోసాలకు విశాఖ పోలీసులు అడ్డుకట్ట వేశారు. టాస్క్ గేమ్స్ పేరిట ప్రలోభాలకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరాలు తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. టాస్క్ గేమ్స్ పేరుతో ఈ సంవత్సరం రూ.9 కోట్లకు పైగా కాజేశారని వెల్లడించారు. నిందితులకు మలేషియా నుంచి ఆదేశాలు అందుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. 

"టాస్క్ గేమ్స్ పేరుతో మోసం చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయి. రివ్యూ రాస్తే రూ.150 ఇస్తామని తొలుత వల విసురుతారు. అనంతరం వారిని టెలిగ్రామ్ గ్రూప్ లోకి తీసుకెళ్లి పెద్ద టాస్క్ ల పేరుతో మరింత ప్రలోభపెడతారు. రూ.2 వేలతో మొదలుపెట్టి లక్షల రూపాయలు కట్టించుకుంటారు. సేకరించిన డబ్బును బిట్ కాయిన్ల రూపంలోకి మార్చుకుంటున్నారు" అని వివరించారు.

More Telugu News