Kollu Ravindra: కొడాలి నాని, వంశీ బుక్కాపకీర్లు.. పేర్ని నాని బందరు పిచ్చోడు: కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు

former minister kollu ravindra anger with kodali nani
  • కొడాలి నాని రాజకీయ వ్యభిచారి అన్న కొల్లు రవీంద్ర
  • స్వార్థం కోసం ఏమైనా చేస్తారని, జగన్‌కూ ద్రోహం చేస్తారని ఆరోపణ
  • ఓటమి భయం వైసీపీ నేతల మొహాల్లో కనిపిస్తోందని వ్యాఖ్య

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని రాజకీయ వ్యభిచారి అని, పిచ్చికుక్క అని మండిపడ్డారు. స్వార్థం కోసం ఏమైనా చేస్తారని, జగన్‌కు కూడా ద్రోహం చేస్తారని అన్నారు. కొడాలి నాని, వంశీ బుక్కాపకీర్లని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావడాన్ని చూసి వైసీపీ నాయకుల్లో భయం పట్టుకుందని కొల్లు రవీంద్ర అన్నారు.

ఓటమి భయం వారి మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. 
బీసీలు పెయిడ్ ఆర్టిస్టులంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘సొంత బాబాయ్‌ని లేపాడు.. కొడాలి నాని వంశీని లేపి టీడీపీ మీదికి తోస్తాడు. జాగ్రత్తగా ఉండండి” అని సెటైర్లు వేశారు. తమపై కేసులు పెడితే భయపడేది లేదని స్పష్టం చేశారు. పేర్ని నాని బందరు పిచ్చోడని, ఏదేదో వాగుతున్నారంటూ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News