Chiranjeevi: ఆ రోజు చిరంజీవి గారు చెప్పిందే నిజమైంది: దర్శకుడు బుచ్చిబాబు

What Chiranjeevi told is happened today says Uppena director Buchi Babu
  • జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన మైత్రీ మూవీ మేకర్స్
  • 'పుష్ప' సినిమాకు అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ లకు అవార్డులు
  • తెలుగులో ఉత్తమ చిత్రంగా 'ఉప్పెన'
వరుస సినిమాలతో టాలీవుడ్ లో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దూసుకుపోతోంది. భారీ విజయాలతో సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా కొనసాగుతోంది. నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల్లో కూడా ఈ సంస్థ నిర్మించిన సినిమాలకు అవార్డులు దక్కాయి. ఈ సంస్థ నిర్మించిన 'పుష్ప' సినిమాకు అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు సాధించాడు. ఇదే సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డును గెలుచుకున్నాడు. 'ఉప్పెన' ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికయింది. అవార్డు వచ్చిన సందర్భంగా 'ఉప్పెన' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ... ఈ సినిమా కథ విన్నప్పుడే ఈ చిత్రానికి నేషనల్ అవార్డు వస్తుందని చిరంజీవి గారు చెప్పారని... ఆయన చెప్పిన మాటే ఈరోజు నిజమయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Chiranjeevi
Uppena movie
Tollywood

More Telugu News