Tollywood: 'స్కంద' కోసం వస్తున్న 'అఖండ'!

  • రేపు శిల్పకళా వేదికలో ఆడియో, ప్రీ రిలీజ్ పంక్షన్
  • ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ
  • సెప్టెంబర్ 15న విడుదల కానున్న చిత్రం
Balakrishna to grace as chief guest for skanda pre release event

పోతినేని రామ్‌-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్కంద. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మధ్య రిలీజైన గ్లింప్స్‌, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో  సెప్టెంబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్ర యూనిట్  ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. 

ఈ క్రమంలో రేపు (శనివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ మేకర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం భారీ విజయం సాధించిన తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కంద కోసం అఖండ వస్తున్నాడంటూ ఇరువురు హీరోల ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.

More Telugu News