Cow Milk: ఒక్క లీటరు ఆవు పాల ఉత్పత్తికి ఎంత నీరు వినియోగించాలో తెలుసా?

  • లీటర్ ఆవు పాల ఉత్పత్తికి 628 లీటర్ల నీటి ఖర్చు, 3.2 కేజీల కార్బన్ డయాక్సైడ్ వాయువు విడుదల
  • ఆవు, గేదె పాల ప్రత్యామ్నాయాలకు క్రమంగా పెరుగుతున్న పాప్యులారిటీ 
  • సోయా మిల్క్, రైస్ మిస్క్, ఆల్మండ్ మిల్క్‌కు అనేక దేశాల్లో ఆదరణ
Environmental impact of milk production from animals

ఆవు, గేదె పాలు.. మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో ప్రధానమైనవి. ఇక పాల ఉత్పత్తి వెనక ఎంతో శ్రమ దాగి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, పాల ఉత్పత్తికి సహజవనరుల వినియోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు ఓ లీటర్ ఆవు పాలు ఉత్పత్తి చేసేందుకు 628 లీటర్ల నీటిని వినియోగించాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా, 3.2 కేజీల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. 

అయితే అనేక దేశాల్లో ప్రస్తుతం ఆవు, గేదె పాలకు బదులుగా అనేక ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది సోయా మిల్క్. పోషకాల పరంగా ఇది ఆవుపాలకు ఏమాత్రం తీసిపోదు. లీటర్ సోయాపాల ఉత్పత్తికి సగటున కేవలం 28 లీటర్ల నీరే ఖర్చవుతుంది. 

సోయా మిల్క్ తరువాతి స్థానాల్లో ఓట్ మిల్క్, రైస్ మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఉన్నాయి. ఒక లీటర్ ఓట్ మిల్క్ ఉత్పత్తికి సగటున 48 లీటర్ల నీరు, లీటరు రైస్ మిల్క్‌ కు 270 లీటర్ల నీరు, లీటరు ఆల్మండ్ మిల్క్ తయారు చేసేందుకు 371 లీటర్ల నీరు ఖర్చవుతుంది. ఇప్పటికే పలు దేశాల్లో వీటికి ఆదరణ పెరుగుతోంది.

More Telugu News