మిజోరంలో ఘోర ప్రమాదం.. 17 మంది మృతి.. వీడియోలు ఇవిగో !
- కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన
- శిథిలాల కింద చిక్కుకుని కార్మికులు దుర్మరణం
- మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అధికారుల ఆందోళన
ఆ సమయంలో సుమారు 35 నుంచి 40 మంది కార్మికులు పని చేస్తున్నారని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 17 మంది కార్మికుల మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పారు. బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. కాగా, ఈ ప్రమాదంపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. వంతెన కూలిన విషయం తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారని ముఖ్యమంత్రి జోరంతంగా వివరించారు.