onion: ఓ నాలుగు నెలలు ఉల్లి తినకుంటే సరిపోతుంది: మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్యలు

  • రూ.10 లక్షల విలువ చేసే కారు వాడుతున్న వారికి రూ.10 పెరిగితే సమస్య లేదన్న 'మహా'మంత్రి
  • కొనలేనివారు కొన్నాళ్లు దూరంగా ఉండాలని ఉచిత సలహా!
  • ఒక్కోసారి క్వింటాల్ రూ.200, మరోసారి రూ.2000 ఉండవచ్చునని వ్యాఖ్య
No difference if people dont eat onions for 2 to 4 months

ఉల్లి ఎగుమతిపై కేంద్రప్రభుత్వం 40 శాతం సుంకాన్ని విధించినప్పటికీ ధరలు అంతగా తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు రెండు నుండి నాలుగు నెలల పాటు ఉల్లిని తినకపోతే పోయేదేం లేదని వ్యాఖ్యానించారు. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని, ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం అగస్ట్ 19న ఉల్లి ఎగుమతులపై భారీ సుంకాన్ని విధించింది. ఉల్లిపై తొలిసారి నోటిఫికేషన్ ద్వారా ఎగుమతి సుంకాన్ని విధించారు. ఇది డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనుంది.

రూ.10 లక్షల విలువ చేసే కారు వాడుతున్నవారికి రూ.10 లేదా రూ.20 పెరిగితే సమస్య ఏమీ ఉండదని, అదే సమయంలో కొనలేనివారు ఓ రెండు నుండి నాలుగు నెలలు ఉల్లికి దూరంగా ఉంటే సరిపోతుందన్నారు. ఒక్కోసారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200 మాత్రమే ఉంటుందని, మరికొన్ని సందర్భాల్లో రూ.2,000కు పెరుగుతుందన్నారు. ఎగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా ధరలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, ఉల్లిపై విధించిన 40 శాతం ఎగుమతి సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు రైతులు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News