అది నా అలవాటు.. సీఎం యోగికి పాదాభివందనం చేయడంపై రజనీకాంత్ వివరణ

లక్నో నగర పర్యటన సందర్భంగా సుపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు పాదాభివందనం చేయడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో ఈ అంశం వివాదాస్పదంగా మారింది. రజనీపై విమర్శలు వెల్లువెత్తాయి. 72 ఏళ్ల వ్యక్తి 51 ఏళ్ల వ్యక్తి పాదాలకు నమస్కరించడమేంటని అనేక మంది సోషల్ మీడియాలో ప్రశ్నించారు.

ఈ ఉదంతంపై రజని తాజాగా స్పందించారు. సన్యాసులు, యోగులూ తన కంటే చిన్నవారైనా సరే పాదాభివందనం చేయడం తనకు అలవాటంటూ ఒక్క ముక్కలో ఈ వివాదానికి ముగింపు పలికారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రజనీకాంత్ ఈ మేరకు సమాధానం చెప్పారు. 2024 ఎన్నికలకు సంబంధించి మరో ప్రశ్న ఎదురవగా తాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టం చేశారు. తన తాజా చిత్రం ‘జైలర్‌’ను ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News