భారీ షెడ్యూల్ కు సిద్ధమవుతున్న పవన్ కల్యాణ్ కొత్త చిత్రం

పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడదే హిట్ కలయికలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందులో పవన్ కల్యాణ్ ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. 

కాగా, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అప్ డేట్ పంచుకుంది. సెప్టెంబరు 5 నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ భారీ షెడ్యూల్ జరగనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నట్టు తెలిపింది. అందుకోసం ఓ భారీ సెట్ నిర్మించినట్టు పేర్కొంది. 

నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యువ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


More Telugu News