Varun Tej: చలి .. వాన .. గాయాలను లెక్కచేయని హీరో వరుణ్ తేజ్: 'గాండీవధారి అర్జున' ఈవెంటులో ప్రవీణ్ సత్తారు

  • ప్రవీణ్ సత్తారు నుంచి 'గాండీవధారి అర్జున'
  • యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ 
  • 54 రోజుల్లోనే షూటింగును పూర్తి చేశామన్న డైరెక్టర్ 
  • వరుణ్ చాలా కష్టపడ్డాడంటూ ప్రశంసలు

Gandeevadhari Arjuna Pre Release Event

'గాండీవధారి అర్జున' పేరుతో వరుణ్ తేజ్ ఒక భారీ యాక్షన్ సినిమా చేశాడు. సాక్షి వైద్య కథానాయికగా నటించిన ఈ సినిమాకి, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఈ నెల 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, ఈ రోజున హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంటును జరుపుకుంది. దీనికి దిల్ రాజుతో పాటు అనిల్ రావిపూడి .. శ్రీకాంత్ అడ్డాల తదితరులు హాజరయ్యారు. 

ఈ స్టేజ్ పై ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ .. " గతంలో నేను ఎమోషన్ ప్రధానంగా నడిచే 'చందమామ కథలు' ..  యాక్షన్ ప్రధానంగా సాగే 'గరుడ వేగ' చేశాను. ఆ రెండింటికీ ప్రాధాన్యతనిస్తూ చేసిన సినిమానే 'గాండీవధారి అర్జున'. వరుణ్ తేజ్ ఎప్పుడూ కూడా కథను సపోర్ట్ చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటాడు. కథలో తాను ఒక పాత్రగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందువల్లనే ఈ కథతో నేను ఆయన దగ్గరికి వెళ్లడం జరిగింది"  అన్నాడు. 

" ఈ సినిమాను 70 రోజులలో పూర్తి చేయాలనుకున్నాము .. కానీ 54 రోజులలోనే పూర్తి చేశాము. అందుకు కారణం వరుణ్ తేజ్ సహకరించడం వల్లనే. చలి .. వానను సైతం లెక్కచేయకుండా ఆయన షూటింగులో పాల్గొన్నాడు. గాయాలైనా పట్టించుకోకుండా చేస్తూ వచ్చాడు. అందువలన ఈ సినిమా ఇంత త్వరగా పూర్తి కావడానికీ .. ఇంత బాగా రావడానికి కారణం వరుణ్ అనే చెబుతాను. ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకే దక్కుతుంది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News