Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్‌లో అభ్యర్థుల ప్రకటనకు ముందు ధిక్కార స్వరం.. హరీశ్‌రావుపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు!

  • మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం చేస్తున్నారన్న మైనంపల్లి హనుమంతరావు
  • అంతుచూసే వరకు వదలబోనని తీవ్ర వ్యాఖ్యలు
  • తనకు, తన కొడుక్కి టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని ప్రకటన
mynampally told that they will contest as independents if medak and malkajgiri tickets are not given

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావుపై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో హరీశ్‌రావు పెత్తనం చేస్తున్నారని, ఆయన అంతుచూసే వరకు వదలబోనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో హరీశ్‌రావును అడ్రస్ లేకుండా చేస్తానని హెచ్చరించారు. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇస్తేనే.. తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

తన కుమారుడిని మెదక్ ఎమ్మెల్యే చేయడమే తన లక్ష్యమని మైనంపల్లి హనుమంతరావు చెప్పారు. మెదక్, మల్కాజ్‌గిరి టికెట్లు ఇస్తేనే.. తాము బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. ఇద్దరికీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్రులుగా పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు.

More Telugu News