విశాఖ-తిరుపతి మధ్య వందేభారత్ రైలు.. వార్తల్లో నిజమెంత?

Railway Denies news that Vande Bharat rail between Visakha and Tirupati
విశాఖపట్టణం-తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రవేశపెడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం చెన్నై నుంచి 16 బోగీలతో కూడిన రైలు విశాఖకు బయలుదేరినప్పటి నుంచీ ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. అయితే, వాల్తేరు రైల్వే అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదని, ఈ విషయంలో తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

మరోవైపు, ఇందుకు భిన్నమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు సాంకేతిక కారణాలతో తరచూ రద్దవుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు, రైలు రద్దయితే మరో రైలును వెంటనే అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతోనే చెన్నై నుంచి రైలును తెప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Go Back to Shorts
Vande Bharat Express
Visakhapatnam
Tirupati

More Telugu News