CWC: కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికే చోటు!

  • 39 మందితో కొత్త కమిటీని నియమించిన ఖర్గే
  • శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు
  • ప్రత్యేక ఆహ్వానితులుగా 9 మంది నేతలు
  • తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డికి మాత్రమే సీడబ్ల్యూసీలో చోటు

mallikharjun kharge reconsitutes cwc all gandhis get berths along with sachin pilot shashi tharoor

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ కొత్త వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని ఏర్పాటు చేసింది. మొత్తం 84 మందితో జాబితాను విడుదల చేసింది. ఇందులో 39 మందిని కమిటీ సభ్యులుగా, శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది నేతలు ఉండనున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా 14 మంది ఇన్‌చార్జ్‌లు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులు, నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కమిటీని ప్రకటించింది. సీడబ్ల్యూసీ టీమ్‌లో ఏపీ నుంచి రఘువీరారెడ్డికి ప్రాతినిథ్యం దక్కింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించారు.

ఖర్గేతోపాటు సీడబ్ల్యూసీ సభ్యులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోనీ, జైరాం రమేశ్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్, సచిన్ పైలట్, అధిర్ రంజన్ చౌదురి, ప్రియాంకా గాంధీ తదితరులు ఉన్నారు. కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న రఘువీరారెడ్డి, రాజస్థాన్‌లో రెబల్‌గా మారిన సచిన్ పైలట్, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసిన శశిథరూర్‌‌ పేర్లు కూడా సీడబ్ల్యూసీలో ఉండటం గమనార్హం.

సీడబ్ల్యూసీలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం రఘువీరారెడ్డికి మాత్రమే చోటుదక్కింది. తెలంగాణకు చెందిన నేతలకు స్థానం దక్కలేదు. శాశ్వత ఆహ్వానితులుగా సుబ్బరామిరెడ్డి, కొప్పుల రాజు, దామోదర రాజనర్సింహా తదితరులు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వంశీచంద్‌రెడ్డి, పల్లంరాజు తదితరులు ఉన్నారు.

More Telugu News