super star: యూపీ సీఎం యోగితో కలిసి ‘జైలర్’ చూడనున్న రజనీకాంత్

super star rajinikanth reched lucknow to meet uttarapradesh cm yogi
  • శనివారం మధ్యాహ్నం లక్నో చేరుకున్న సూపర్ స్టార్
  • లక్నో విమానాశ్రయంలో మీడియాకు వివరాల వెల్లడి
  • దేవుడి దయవల్ల సినిమా విజయం సాధించిందన్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిసేందుకు శనివారం లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్నో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల జైలర్ సినిమా విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను యూపీ సీఎం యోగితో కలిసి చూసేందుకే తాను లక్నో వచ్చానని రజనీకాంత్ మీడియాకు తెలిపారు.

ఇటీవల విడుదలైన రజనీ కొత్త సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోని ‘కావాలయ్యా.. ’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. జపాన్ లోని రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జపాన్ అంబాసిడర్ కూడా ఈ పాటకు కాలుకదిపిన వీడియో వైరల్ గా మారింది. కాగా, సినిమా విడుదల రోజు హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్.. శుక్రవారం వరకూ వివిధ ఆలయాలను సందర్శిస్తూ గడిపారు. యూపీ సీఎంను కలిసి ‘జైలర్’ సినిమాను వీక్షించేందుకు రజనీ శనివారం లక్నో చేరుకున్నారు.
super star
Rajinikanth
jailor movie
Yogi Adityanath
Rajini to meet yogi

More Telugu News