16-18 ఏళ్ల వారిమధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారంపై మీ అభిప్రాయం ఏమిటి?: కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్న
- చట్టం పరిధిలో నేరంగా పరిగణించడాన్ని సవాల్ చేస్తూ పిల్
- దీనిపై కేంద్ర న్యాయ, హోంశాఖ లకు నోటీసుల జారీ
- తమ ఇష్ట ప్రకారం వ్యవహరించే స్వేచ్ఛ ఉండాలన్న వాదన
స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ, హోంశాఖ, జాతీయ మహిళా కమిషన్ లకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. 16-18 ఏళ్ల వయసులోని వారి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని అత్యాచార నిరోధక చట్టాల కింద నేరంగా పరిగణించడాన్ని ఈ పిల్ సవాల్ చేసింది. కౌమార దశలోని వారు శారీరక, జీవ, భౌతిక పరమైన అవసరాలు, సమాచారాన్ని విశ్లేషించుకోగలరని.. నిర్భయంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వారు తమ శరీరాలతో చేయాలనుకున్నది చేసుకోగలిగే అవకాశం ఉండాలని పిటిషనర్ కోరారు.