Raghunandan Rao: ఈటల రాజేందర్ వ్యాఖ్యలను సమర్థించిన రఘునందనరావు

  • నిర్మల్ మున్సిపాల్టీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు దీక్షలో పాల్గొన్న దుబ్బాక ఎమ్మెల్యే
  • ఆపరేషన్ ఆకర్ష్‌లో మా వ్యూహాలు మాకు ఉన్నాయని వ్యాఖ్య
  • కొంతమంది తమకు మనుగడ లేక పార్టీ మారుతున్నారని విమర్శ
Raghunandan Rao on Etala Rajender comments

బీజేపీలోకి 22 మంది వస్తున్నారన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలను దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందనరావు సమర్థించారు. నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ రద్దుకై మహేశ్వరరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్వరలో వారందరూ పార్టీలోకి వస్తారన్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌లో మా వ్యూహాలు మాకు ఉన్నాయన్నారు. త్వరలో బీజేపీ సత్తా ఏమిటో చూస్తారని రఘునందనరావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందే బీజేపీ జాబితా వస్తుందని చెప్పారు. కొంతమంది తమకు మనుగడ లేక పార్టీ మారుతున్నారన్నారు. ఇలాంటి వాటిపై ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు. నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం జీవో 220ని రద్దు చేయాలన్నారు.

ఈ నెల 27న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. దీనికంటే ముందే పెద్ద ఎత్తున నేతలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవల ఈటల మాట్లాడుతూ... దాదాపు 22 మంది తమతో టచ్‌లో ఉన్నారని, అందులో కొంతమంది అమిత్ షా పర్యటనలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. మరికొందరితో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఈ వ్యాఖ్యలను రఘునందనరావు సమర్థించారు.

More Telugu News