WhatsApp: హెచ్ డీ క్వాలిటీ ఫొటోలు పంపేలా వాట్సప్ లో సరికొత్త ఫీచర్

  • ప్రకటించిన సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్
  • ప్రపంచ వ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తుందని వెల్లడి
  • యాప్ తో పాటు వెబ్ వెర్షన్ లోనూ ఫీచర్ ను వాడొచ్చన్న కంపెనీ
 WhatsApp now allows users to share HD images

వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వాట్సప్ లో ఇప్పటిదాకా ఫొటోలను తక్కువ రిజల్యూషన్ లో పంపించే వీలుంది. ఇకపై ఫొటోలను ‘హెచ్‌డీ’ క్వాలిటీ ఫార్మాట్‌లోకి మార్చి పంపే సౌలభ్యాన్ని తీసుకువస్తున్నట్టు కంపెనీ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రకటించారు. ఈ ఆప్షన్‌ మరికొన్ని రోజుల్లో అందుబాటులో వస్తుందని చెప్పారు. దీంతో పాటు హెచ్‌డీ క్వాలిటీ వీడియోలను కూడా సపోర్ట్‌ చేసే విధంగా వాట్సాప్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. స్మార్ట్ ఫోన్లలో వాట్సప్ యాప్ తో పాటు వెబ్‌ వెర్షన్లలోనూ ఈ కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు వాట్సప్ మాతృ సంస్థ మెటా అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాట్సప్ ను అప్ గ్రేడ్ చేసిన తర్వాత కనిపించే హెచ్‌డీ ఐకాన్‌పై క్లిక్‌ చేయటం ద్వారా సరికొత్త ఆప్షన్లను ఎంచుకోవచ్చని వివరించింది.

More Telugu News