Vespa: ‘వెస్పా’ కొత్త స్కూటర్.. వామ్మో ఇంత ధరనా?

justin bieber x edition vespa scooter in lauched in india
  • భారత మార్కెట్‌లోకి వెస్పా కొత్త మోడల్‌
  • రూ.6.45 లక్షలుగా నిర్ణయించిన కంపెనీ
  • ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో లాంచ్‌
  • బీబర్ ఆలోచనలకు అనుగుణంగా తయారు చేసినట్లు కంపెనీ వెల్లడి
‘వెస్పా’ స్కూటర్ అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. అలా ఉంటాయి ఆ బండి లుక్స్. ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో సంస్థ వీటిని తయారు చేస్తుంది. తాజాగా ఓ కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఆ బండి ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.6.45 లక్షలట మరి.  

వెస్పా కొత్త మోడల్‌కు అంత భారీ ధర నిర్ణయించడానికి ఓ కారణముంది. ‘జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్’ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. ఇది లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ అని, పరిమిత సంఖ్యలో మాత్రమే వీటిని విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. కెనడా పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఆలోచనలకు అనుగుణంగా బండిని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం బీబర్‌‌తో సంస్థ ఒప్పందం కూడా చేసుకోవడం గమనార్హం. 

వెస్పా కొత్త మోడల్ స్కూటర్‌‌లో 150 సీసీ ఇంజిన్ ఉంది. 8 లీటర్ల ఫ్యూయల్ కెపాసిటీ ట్యాంక్ ఏర్పాటు చేశారు. మిగతావన్నీ గత వెస్పా మోడల్స్‌లో మాదిరే ఉంటాయి. వెస్పా వెబ్‌సైట్ ద్వారా ప్రీ బుక్ చేసుకోవచ్చు.
Vespa
JUSTIN BIEBER X edition
Piaggio Vehicles
vespa scooter

More Telugu News