ktr: సూట్ కేస్ లా మడత పెట్టే వ్రత పీఠం.. కార్పెంటర్​ ప్రతిభకు మంత్రి కేటీఆర్ ఫిదా

KTR impressed with  Handicrafts Carpenter skill
  • తన వృత్తి నైపుణ్యంతో కేటీఆర్ ను మెప్పించిన కార్పెంటర్
  • సూట్‌ కేసు మాదిరిగా మడత పెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు
  • ఈ వీడియోను నెట్‌ లో షేర్ చేసి కేటీఆర్ ను ట్యాగ్ చేసిన ఓ నెటిజన్
ఓ కార్పెంటర్ తన వృత్తి నైపుణ్యంతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టిని ఆకర్షించాడు. సూట్‌ కేసు మాదిరిగా మడత పెట్టే సత్యనారాయణ స్వామి వ్రత పీఠం తయారు చేశాడు. సూట్‌ కేసులా తీసుకొచ్చి దాన్ని విడి చేసి పీఠంలా మార్చుకునేలా రూపొందించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో ఓ సూట్ కేసు రూపంలో ఉన్న ఓ చెక్కె పెట్టెను తీసుకొని వచ్చారు. 

దానిని ఓపెన్ చేసి, అందులోని విడి భాగాలను బయటకు తీసి ఒక్కొక్కటిగా పేరుస్తూ వెళ్లగా వ్రత పీఠంలా మారింది. ఇంత నైపుణ్యం ప్రదర్శించిన ఆ కార్పెంటర్ కు సాయం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. సదరు కార్పెంటర్ నైపుణ్యం అద్భుతం అని కొనియాడారు. అతనికి ఎలా సాయం చేయవచ్చో పరిశీలించాలని హైదరాబాద్‌ లోని టీ–వర్క్స్ అధికారులకు సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ktr
Carpenter
skill
Twitter
Viral Videos

More Telugu News