Muslim Teen Thrashed: హిందూ బాలికతో కలిసి వెళ్తున్న ముస్లిం టీనేజర్‌పై బాంద్రా రైల్వే స్టేషన్‌లో మూకదాడి

Muslim Teen Thrashed For Travelling With Kidnapped Girl In Mumbai

  • ముస్లిం అబ్బాయిపై విచక్షణ రహితంగా దాడి
  • బాలికను పోలీసులకు అప్పగించిన దుండగులు
  • గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

ముంబై బాంద్రా రైల్వే స్టేషన్‌లో ముస్లిం బాలుడిపై దాడి జరిగింది. కిడ్నాప్‌కు గురైందంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన బాలికతో కలిసి అతడు కనిపించడంతో కొందరు యువకులు అతడిని చుట్టుముట్టి ఈడ్చి పడేసి దాడిచేశారు. జులై 21నే ఈ ఘటన జరగ్గా ఇప్పుడీ వీడియో బయటకు వచ్చింది. బాలికది ముంబై పక్కనే ఉన్న అంబర్‌నాథ్. తమ కుమార్తె కిడ్నాప్ అయిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాంద్రా టెర్మినస్‌ లో ముస్లిం అబ్బాయి సదరు బాలికతో కలిసి ఉండడం చూసిన కొందరు వ్యక్తులు వారిని పట్టుకున్నారు. అనంతరం అబ్బాయిపై పిడిగుద్దులు కురిపిస్తూ ఈడ్చుతూ దాడిచేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత అతడిని స్టేషన్ బయటకు తీసుకెళ్లి అక్కడా దాడిచేశారు. బాలికను పోలీసులకు అప్పగించారు.  

అభ్యంతరకర నినాదాలు చేస్తూ బాలుడిపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధిత బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు పేర్కొన్నారు. బాలుడిపై దాడిచేస్తున్న వారు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నారని, త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని తెలిపారు. 

Muslim Teen Thrashed
Mumbai
Bandra Railway Station
  • Loading...

More Telugu News