IMD: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు

  • ఎల్లుండి పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన
  • ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం
IMD Warns Chance to Heavy Rains in Telangana And Andhra Pradesh and Other States

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా గురు, శుక్ర (నేడు, రేపు) వారాల్లో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజ్ గిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వానలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది.

ఉత్తరాది రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ లను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు, వరదల కారణంగా రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. తాము కోలుకోవడానికి ఏడాదికి పైగా సమయం పడుతుందని వివరించారు. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లో చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. అక్కడి ప్రజలను కాపాడేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, బీఎస్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

More Telugu News