సీఎం జగన్‌ను కలిసిన శ్రీస్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు

Shree Swaminarayan Gurukul International School members meet CM Jagan
  • ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు
  • విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఏర్పాటుకు ట్రస్ట్ అంగీకారం
  • తిరుపతిలో స్కూల్ శంకుస్థాపనకు రావాలని జగన్‌కు ఆహ్వానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు కలిశారు. రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు ఈ ట్రస్ట్ సంసిద్ధత వ్యక్తం చేసింది. విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో బుధవారం ముఖ్యమంత్రిని కలిసిన ట్రస్ట్ సభ్యులు... సెప్టెంబర్ నెలలో తిరుపతి స్కూల్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. దీనికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు.
Go Back to Shorts
Shree Swaminarayan Gurukul trust
YS Jagan
Andhra Pradesh
international school

More Telugu News