హిమాచల్, ఉత్తరాఖండ్‌లో కుంభవృష్టి.. 66 మంది మృతి
- వందలాది మందికి గాయాలు
- కొండచరియలు విరిగిపడి కుప్పకూలుతున్న ఇళ్లు
- మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన
కాగా సిమ్లా, జోషిమఠ్ లో ఇళ్లు నేలకూలి అధిక ప్రాణనష్టం జరుగుతోంది. మంగళవారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో శిథిలాల నుంచి మూడు మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. సిమ్లాలో కూలిన శివాలయం శిథిలాల నుంచి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. నగరంలో కొండచరియలు విరిగిపడటంతో తాజాగా మరో ఇద్దరు మరణించారని అధికారులు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ ఈ రోజు సెలవు ప్రకటించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీతో పాటు పోలీసులు ఈ ఉదయం 6 గంటలకు సమ్మర్ హిల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లను తిరిగి ప్రారంభించాయని సిమ్లా డిప్యూటీ కమిషనర్ ఆదిత్య నేగి తెలిపారు.