Delhi Murder: ప్రియుడు వెళ్లిపోవడంతో.. కోపంతో అతని కొడుకుని చంపిన ప్రియురాలు

Women kills her lovers son as he went back to his wife
  • 2019 నుంచి సహజీవనం చేస్తున్న పూజ, జితేందర్
  • మూడేళ్ల తర్వాత తన భార్య, కుమారుడి వద్దకు వెళ్లిపోయిన ప్రియుడు
  • ప్రియుడి 11 ఏళ్ల కుమారుడిని గొంతు కోసి చంపిన ప్రియురాలు
తనతో సహజీవనం చేస్తున్న ప్రియుడు తనను వదిలేసి వెళ్లడంతో కోపం పట్టలేక పోయిన ప్రియురాలు అతని కొడుకుని హత్య చేసిన ఘటన ఢిల్లీలోని ఇంద్రపురిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పూజా కుమారి అనే 24 ఏళ్ల యువతికి జితేందర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. 2019 నుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అయితే, మూడేళ్ల తర్వాత ఆయన పూజను వదిలేసి తన భార్య వద్దకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు గురైన ఆమె తన ప్రియుడి 11 ఏళ్ల కుమారుడిని హత్య చేసింది. 

జితేంద్ర ఇంటి అడ్రస్ కావాలని తమ కామన్ ఫ్రెండ్ ను ఆగస్ట్ 10న పూజ అడిగింది. అడ్రస్ తెలుసుకుని అక్కడకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. జితేందర్ కొడుకు బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. ఇదే అదనుగా భావించిన ఆమె అబ్బాయి గొంతు కోసి చంపేసింది. ఆ తర్వాత బట్టలతో పాటు అబ్బాయి డెడ్ బాడీని ఒక బాక్స్ లో పెట్టి బయటకు తీసుకొచ్చింది. 

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల సహకారంతో ఒక మహిళ వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఇంద్రపురితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమె ఆ ప్రాంతంలోనే ఉందని, అయితే తాను ఉండే ప్రదేశాలను మారుస్తోందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమె గురించి ఎంత మందిని ప్రశ్నించినా వారికి ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులను వదిలేసి చాలా కాలం అయిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. చివరకు మూడు రోజుల తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ... ఆమె తనను పెళ్లి చేసుకోవాలనుకుందని... పెళ్లికి తన కుమారుడు అడ్డంకిగా మారాడని భావించేదని చెప్పాడు.
Delhi Murder
Women
Lover
Son

More Telugu News