Tamannaah: 'కావాలయ్యా..' పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన జపాన్ యువకుడు.. వీడియో ఇదిగో!

  • సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కావాలయ్యా సాంగ్
  • ఇన్ స్టాలో వైరల్ గా మారిన జపాన్ యువకుడి వీడియో
  • వారం వ్యవధిలో రెండు లక్షలకు పైగా వ్యూస్
Japanese Man Dances To Tamannaah song From The Film Jailer

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘జైలర్’ సినిమా రికార్డు వసూళ్లతో బాక్సాఫీస్ ను కొల్లగొడుతోంది. దేశవిదేశాల్లోని రజనీ అభిమానులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ సినిమాలోని కావాలయ్యా పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పాటకు ఓ జపాన్ కుర్రాడు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. కావాలా ఫ్రం జపాన్ క్యాప్షన్ తో కాకెటకు అనే కొరియోగ్రాఫర్ తన ఇన్ స్టాలో ఈ వీడియోను పంచుకున్నాడు.

ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను అనుకరిస్తూ కాకెటకు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వారం క్రితం ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు వివిధ సోషల్ మీడియాలలో షేర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ డ్యాన్స్ క్లిప్ ను 2 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. వేలల్లో లైకులు, కామెంట్లతో కాకెటకును మెచ్చుకుంటున్నారు. వీడియో కోసం..

More Telugu News