Eiffel Tower: తాగిన మైకంలో ఈఫిల్ టవర్‌పై నిద్రపోయిన టూరిస్టులు

  • ఆదివారం రాత్రి టిక్కెట్టు కొనుక్కుని టవర్ ఎక్కిన అమెరికా టూరిస్టులు
  • కిందకు వచ్చే సమయంలో సిబ్బందిని బురిడీ కొట్టించి నిషేధిత ప్రాంతంలోకి ఎంట్రీ
  • తాగిన మైకంలో కన్‌ఫ్యూజ్ అయి కిందకు రాలేక అక్కడే నిద్రించిన వైనం
  • మరుసటి ఉదయం గాఢనిద్రలో ఉన్న వారిని గుర్తించిన సిబ్బంది
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Drunk US Tourists Found Sleeping Atop Eiffel Tower After Evading Security

అమెరికాకు చెందిన ఇద్దరు పర్యాటకులు మద్యం మైకంలో ప్యారిస్‌లోని ప్రముఖ ఈఫిల్ టవర్‌పై నిద్రపోయారు. సోమవారం ఉదయం 9.00 గంటలకు సందర్శకులను టవర్‌పైకి అనుమతించే ముందు సిబ్బంది అక్కడ తనిఖీలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. టవర్ రెండు, మూడు అంతస్తుల మధ్య పర్యాటకులకు అనుమతి లేని ప్రాంతంలో నిద్రపోతున్న అమెరికా టూరిస్టులను సిబ్బంది గుర్తించారు. తాగిన మైకంలో టవర్ ఎక్కిన వారు ఆ రాత్రి అక్కడే చిక్కుకునిపోయి ఉంటారని ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు మీడియాకు తెలిపారు. భద్రతా సిబ్బందిని బురిడీ కొట్టించి వారు ఈఫిల్ టవర్‌పైకి ఎక్కి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ఆదివారం రాత్రి టవర్‌ను చూసేందుకు వారు టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే, కిందకు వచ్చే క్రమంలో వారు సిబ్బంది కళ్లుకప్పి అక్కడున్న బేరియర్లను దాటుకుని నిషేధిత ప్రాంతంలోకి వెళ్లారు. చివరకు కిందకు ఎలా రావాలో తెలీక అక్కడే రాత్రంతా గడిపారు. అత్యవసర సిబ్బంది సాయంతో వారిని జాగ్రత్తగా కిందకు దింపిన అనంతరం, ప్యారిస్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News