సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై 'భోళాశంకర్' నిర్మాత క్లారిటీ

  • చిరంజీవి రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో చర్చ
  • నిర్మాత అనిల్ సుంకర ఆస్తులు తాకట్టు పెట్టారంటూ ప్రచారం
  • ఆ వార్తలు బేస్ లెస్, సెన్స్ లెస్ అన్న నిర్మాణ సంస్థ
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేశ్ కాంబినేషన్లో రూపొందిన 'భోళాశంకర్' మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈ సినిమాలో చిరంజీవి రెమ్యునరేషన్ కు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. నిర్మాత వాట్సాప్ చాట్ అంటూ ఒక స్క్రీన్ షాట్ వైరల్ అవుతోంది. నిర్మాత అనిల్ సుంకర దగ్గర డబ్బుల్లేక ఆస్తులు తనఖా పెట్టారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్ మెంట్స్ స్పందించింది. ఆన్ లైన్ లో ప్రచారమవుతున్న వార్తలన్నీ బేస్ లెస్, సెన్స్ లెస్ అని వ్యాఖ్యానించింది. ఆ వార్తల్లో ఒక్క శాతం నిజం కూడా లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మవద్దని కోరింది. ఈ అంశంపై అనవసరమైన డిస్కషన్ పెట్టొద్దని కోరుతున్నామని ట్వీట్ చేసింది. 


Bhola Shankar
Chiranjeevi
Tollywood
Producer
Anil Sunkara

More Telugu News