World Cup: వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు... తేదీలు ప్రకటించిన ఐసీసీ

  • వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్న భారత్
  • అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ మెగా టోర్నీ
  • ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
  • ఈ నెల 25 నుంచి టికెట్ల అమ్మకాలు
ICC announces World Cup event ticket sales dates

భారత్ లో అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాల తేదీలను ఐసీసీ నేడు ప్రకటించింది. 

వార్మప్ మ్యాచ్ ల నుంచి, వరల్డ్ కప్ ఫైనల్ వరకు అన్ని మ్యాచ్ ల టికెట్లను బుక్ మై షో ద్వారా విక్రయించనున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల కోసం తమ ఆసక్తిని ప్రదర్శిస్తూ అభిమానులు ముందుగా రిజిస్టర్ (https://cricketworldcup.com/register) చేసుకోవాలని ఐసీసీ సూచించింది. ఆగస్టు 25 నుంచి టికెట్ల అమ్మకాలు షురూ అవుతాయని తెలిపింది. 


ఆగస్టు 25-  భారత జట్టు మినహా... ఇతర అన్ని జట్లు ఆడే వార్మప్ మ్యాచ్ లు, ఇతర అన్ని జట్ల వరల్డ్ కప్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు
ఆగస్టు 30- గువాహటి, త్రివేండ్రం స్టేడియంలలో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు
ఆగస్టు 31- చెన్నై, ఢిల్లీ, పూణే నగరాల్లో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 1- ముంబయి, లక్నో, ధర్మశాలలో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 2- బెంగళూరు, కోల్ కతాలో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు
సెప్టెంబరు 3- అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ ఆడే మ్యాచ్ ల టికెట్ల  అమ్మకాలు
సెప్టెంబరు 15- వరల్డ్ కప్ సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ల టికెట్ల అమ్మకాలు

More Telugu News