Elon Musk: జుకర్‌‌బర్గ్ ఇంటికి పోతున్నా.. తలుపు తెరిస్తే అక్కడే ఫైట్: ఎలాన్ మస్క్

going to zukerberg house if he opens door for me then fight is on
  • మస్క్, జుకర్ బర్గ్ మధ్య ‘కేజ్‌’ ఫైట్‌పై చాలారోజులుగా చర్చ
  • మస్క్ డేట్లు ఇవ్వడం లేదన్న జుకర్‌‌ బర్గ్ 
  • కేజ్ ఫైట్ గురించి మస్క్ సీరియస్‌గా లేరని విమర్శ
  • టెస్లా కారులో జుకర్ బర్గ్ ఇంటికి వెళ్తానన్న మస్క్
అపర కుబేరులు, టెక్ దిగ్గజాలైన ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ మధ్య ‘కేజ్‌’ ఫైట్ కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇద్దరూ ఈ మేరకు ట్రైనింగ్, ప్రాక్టీస్ జోరుగానే చేస్తున్నారు. పనిలో పనిగా అప్పుడప్పుడు మాటల ఫైట్‌కూ దిగుతున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఫైట్ కోసం మస్క్ డేట్లు ఇవ్వడం లేదని ఆదివారం జుకర్‌‌ బర్గ్ ఆరోపించారు. కేజ్ ఫైట్ గురించి మస్క్ సీరియస్‌గా లేరని, ఇకపై ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయడం మంచిదని ‘థ్రెడ్స్‌’లో పేర్కొన్నారు. 

దీనికి మస్క్‌ స్పందించారు. ‘‘ఈ రోజు రాత్రి నా టెస్లా కారు (ఆటో పైలట్‌లో)ను పాలో ఆల్టోలోని జుకర్ బర్గ్ ఇంటికి తీసుకెళ్లమని చెప్తాను. అలాగే ఎక్స్‌ (ట్విట్టర్‌‌)లో లైవ్ స్ట్రీమింగ్‌ను కూడా పరీక్షిస్తాం. జుకర్‌‌బర్గ్ నా కోసం తలుపు తీస్తే.. మీరు మీ ఫైట్‌ను చూడొచ్చు” అని ట్వీట్ చేశారు. 

దీనికి మెటా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘జుకర్ బర్గ్ ఇంట్లో ఉండరు. ఆయన షెడ్యూల్ ప్రకారం వేరే చోటుకు వెళ్తున్నారు” అని చెప్పారు. మస్క్ బదులిస్తూ.. ‘‘నేను ట్వీట్ చేసిన తర్వాత జుకర్‌‌బర్గ్ ఇంట్లో హడావుడిగా బ్యాగ్‌లు ప్యాక్ చేశాడు. ఎక్కడికో వెళ్తున్నట్టున్నాడు” అని సెటైర్లు వేశారు. కానీ వీళ్లిద్దరి మధ్య ఫైట్ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.
Elon Musk
Mark Zukerberg
Cage Fight

More Telugu News