KCR: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..అన్ని ఏర్పాట్లు పూర్తి

All arrangements in for independence day celebrations in Telugu states
  • విజయవాడలో సీఎం జగన్, గోల్కొండ కోట వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ త్రివర్ణ పతాకాల ఆవిష్కరణ
  • అనంతరం, రాష్ట్రప్రజలను ఉద్దేశించి ఇరు సీఎంల ప్రసంగం
  • ఏర్పాట్లను మరోసారి సమీక్షించిన అధికార యంత్రాంగం
తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ జెండా ఎగరేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
KCR
YS Jagan
Telangana
Andhra Pradesh

More Telugu News