వ్యక్తిగత జీవితం గురించి నెటిజన్ ప్రశ్న.. దీటుగా స్పందించిన స్మృతి ఇరానీ
- ఇన్స్టా వేదికగా ఆస్క్ మి ఎనీథింగ్
- మీ స్నేహితురాలి భర్తను వివాహం చేసుకున్నారా? అని అడిగిన నెటిజన్
- ఆమె నా కంటే పెద్దది.. రాజకీయాల్లో లేరు.. లాగవద్దని సూచించిన కేంద్రమంత్రి
పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. తనకు వడాపావ్, పానీపూరీ రెండూ ఇష్టమేనని, అలాగే ఢిల్లీ, ముంబై.. రెండు నగరాలు ఇష్టమేనని చెప్పారు. నిజాయతీగా ఉండి రాజకీయాల్లో రాణించడానికి అదృష్టమే కారణమన్నారు. ఎవరైనా నిజాయతీగా ఉంటే అదే వారిని ముందుకు తీసుకు వెళ్తుందన్నారు.