Anushka Shetty: 'మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి' రిలీజ్ డేట్ ఖరారు!

  • యూవీ క్రియేషన్స్ నుంచి 'మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి'
  • ప్రధానమైన పాత్రల్లో అనుష్క - నవీన్ పోలిశెట్టి 
  • అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్న సినిమా 
  • సెప్టెంబర్ 7వ తేదీన సినిమా విడుదల

Miss Shetty Mr Polyshetty Release date confirmed

అనుష్క - నవీన్ పోలిశెట్టి ప్రధానమైన పాత్రలుగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ - ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు. పి.మహేశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా, కామెడీ ప్రధానమైన కథాంశంతో కొనసాగుతుంది.

చాలా గ్యాప్ తరువాత అనుష్క చేసిన సినిమా కావడం వలన, ఆమె అభిమానులంతా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 'కృష్ణాష్టమి' సందర్భంగా సెప్టెంబర్ 7వ  తేదీన విడుదల చేయనున్నారు. 

రధన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, జయసుధ .. మురళీశర్మ .. తులసి .. హర్షవర్ధన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. యూవీ వంటి పెద్ద బ్యానర్లో ఈ సినిమా నిర్మితం కావడం, 'జాతిరత్నాలు' తరువాత నవీన్ పోలిశెట్టి చేసిన సినిమా ఇదే కావడం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది..

More Telugu News