Stock Market: నష్టాల నుంచి తేరుకుని లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 79 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 6 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • రెండున్నర శాతం వరకు నష్టపోయిన జేఎస్ డబ్ల్యూ స్టీల్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు ప్రారంభమైన వెంటనే అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత ఐటీ, టెక్ సూచీల అండతో పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 79 పాయింట్లు లాభపడి 65,402కి చేరుకుంది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 19,435 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (1.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.26%), రిలయన్స్ (1.13%), ఎల్ అండ్ టీ (0.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.70%). 

టాప్ లూజర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.47%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.37%), టాటా స్టీల్ (-1.79%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.39%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.20%).

More Telugu News