Shabbir Ali: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసినా కాంగ్రెస్సే గెలుస్తుంది: షబ్బీర్ అలీ

Congress will win next elections
  • తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదన్న షబ్బీర్
  • కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సానుకూల ప్రభావం చూపుతున్నాయని వ్యాఖ్య
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే గెలుపని ధీమా
గత తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు పార్టీపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పారు. బీసీలు, దళితులు, మైనార్టీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు వంట గ్యాస్ సిలిండర్ రూ. 500కే ఇస్తామని చెప్పారు. కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారే వార్తలపై స్పందిస్తూ... పోటీని ఆహ్వానిస్తానని అన్నారు. కేసీఆర్ పోటీ చేసినా కాంగ్రెస్సే గెలుస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని అన్నారు.
Shabbir Ali
congress
kcr
brs

More Telugu News